- రద్దయిన బస్సు సేవలు
- పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్
రామడుగు, న్యూస్‌లైన్: కరీంనగర్ పట్టణానికి సమీప గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రవేశపెట్టిన సిటీ బస్సులు మూ ణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. గత నవంబర్‌లో అప్పటి ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు ప్రారంభించా రు. వీటిని కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కరీంనగర్ నుంచి కొత్తపలి, వెదిర గ్రామాలకు, మానకొండూర్ నుంచి పద్మనగర్ వరకు సర్వీసులను ప్రారంభించారు. గత ఏప్రిల్ చివరి వరకే బస్సులు నడిచాయి. ప్రస్తుతం ఈ సిటీ బస్సుల జాడ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎమ్మెస్సార్ స్వగ్రామం వెదిర వరకు సిటీబస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు నవంబర్ 12 నుంచి సిటీ బస్సులను పొడిగిం చారు. వీటితో ఈ రూట్లోని గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రద్దు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు కరీంనగర్ వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు.
కనిపించని ఆర్డినరీ బస్సులు
కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి గుండా ఆర్డినరీ బస్సులు ఆధికారులు అంతంత మాత్రంగానే నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిపై గుండా కేవలం మూడు ఆర్డినరీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నా రు.బస్సులు లేకపోవడంతో ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నామని వెదిరకు చెందిన సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన సిటీ బస్సులను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వెదిర, దేశరాజ్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.
సిటీ బస్సులు..మూణ్నాళ్ల ముచ్చటేనా?
Published Tue, May 20 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement