సాక్షి, నిజామాబాద్ : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్ర కేబినెట్‌లో బెర్త్ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండడంతో అవకాశం రాలేదు. చిరకాల వాంఛ నెరవేరకపోfడ బాజిరెడ్డికి నిరాశ కలిగించే అంశమే.. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నాయకుడిగా ఉన్న బాజిరెడ్డి ఆది నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉంటూ వచ్చారు.
చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్
2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. మళ్లీ తాజాగా ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఈ పదవిలో నియమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
చదవండి: NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3
Comments
Please login to add a commentAdd a comment