bajireddy Goverdhan
-
TSRTC: లాభాల్లోకి రాకుంటే ప్రై‘వేటే’
సాక్షి, హైదరాబాద్: ‘మరో మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకుంటే ప్రైవేట్‌పరం చేస్తాం, తర్వాత మీ ఇష్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించినా పరిస్థితిలో మార్పు చూపకపోవటం ఏంటంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..’ అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతా కలిసి గట్టెక్కించాలి ‘రాష్ట్రంలో 97 డిపోలుంటే అన్నీ నష్టాల్లో ఉన్నాయంటే అధికారుల పనితీరులో ఎక్కడో లోపం ఉందని స్పష్టమవుతోంది. పరిస్థితి మారకుంటే ప్రభుత్వం ఎంతకాలం నిధులు కేటాయిస్తూ పోతుందనేది సీఎం ఆవేదన. అందుకే ఉన్నతాధికారులు మొదలు డిపో మేనేజర్ వరకు అందరి పనితీరు మారాల్సి ఉంది. సంస్థను గట్టెక్కించే విధంగా వ్యవహరించాలి. అందుకే డిపో స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించాం. మరో రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తాం. నేనో వైపు, ఎండీ సజ్జనార్ మరోవైపు పర్యటనలు జరిపి లోపాలు గుర్తించి దిద్దుబాటుకు దిగుతాం. ఒక బస్సు రోజుకు ఇన్ని కి.మీ.లు తిరగాలి అని గతంలో నిర్ధారించారు. దాన్ని గుడ్డిగా పాటిస్తున్న అధికారులు ప్రయాణికులు లేకున్నా తిప్పుతున్నారు. ఇది ఎంత దుబారాకు దారి తీస్తుంది. అలాగే ఒకే డిపోలో ఒకే ప్రాంతానికి ఒకే సారి రెండుమూడు బస్సులు బయలుదేరుతున్నాయి. దీనివల్ల ఏ బస్సులోనూ సరైన ఆక్యుపెన్సీ ఉండటం లేదు. ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దాల్సి ఉంది. రెండు మూడు నెలల్లోనే సంస్థను లాభాల్లోకి తేవాలి. లేకుంటే ఆర్టీసీని ప్రభుత్వం భరించడం కష్టం అనేది సీఎం ఉద్దేశం..’ అని బాజిరెడ్డి తెలిపారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్ కొత్తగా భర్తీ లేదు .. బస్సుల్లేవు ‘ఆర్టీసీలో ఇప్పట్లో ఇక కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదని, కొత్త బస్సులు కొనబోమని, కొత్త నిర్మాణాలు చేపట్టబోమని కూడా సీఎం చెప్పారు. అందువల్ల ఉన్న బస్సులనే ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటాం. మరీ అవసరమైతేనే కొత్త బస్సుల కోసం ఆలోచిస్తాం..’ అని చెప్పారు. సీఎం ఆగ్రహంపై చర్చ రెండేళ్ల కిందట కార్మిక సంఘాలు ఉధృతంగా సమ్మె నిర్వహించిన సమయంలోనూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం హెచ్చరించారు. ఆ సమయంలోనే ఆర్టీసీ ఏకంగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్య 3,100కు చేరింది. తాజాగా అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించటం సంస్థలో తీవ్ర చర్చకు దారి తీసింది. -
గట్టెక్కించండి.. మరో మార్గం లేదు..
రూ.3 వేల కోట్లు కోల్పోయాం.. గత ఏడాదిన్నరగా డీజిల్ ధర లీటర్‌పై రూ.22 మేర పెరిగింది. దీంతో రూ.550 కోట్ల అదనపు భారం పడింది. విడిభాగాల ధరలూ బాగా పెరిగాయి. దీంతో సాలీనా రూ.600 కోట్ల భారం పెరిగింది. కరోనా లాక్డౌన్లతో మొత్తంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. –ఆర్టీసీ అధికారులు తీవ్ర నష్టాలు వచ్చాయి విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు. విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలి. – విద్యుత్ అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టండి.. ఎంతసేపూ సిటీ బస్సుల నష్టాలు, పల్లె వెలుగు కష్టాల గురించి మాట్లాడకుండా.. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దూరప్రాంత సర్వీసులపై దృష్టి సారించాలి. సంస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ఎండీ సజ్జనార్‌పై ఉంది. ఆయనకు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. కోవిడ్‌తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్లో ఆర్టీసీ, విద్యుత్ విభాగాల అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించారు. సాలీనా రూ.600 కోట్ల భారం... తొలుత ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో సంస్థ మనుగడ సాగాలంటే ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచుకోవాల్సిన పరిస్థితి తప్ప గత్యంతరం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డీజిల్ ధర లీటర్‌కు రూ.65 ఉన్నప్పుడు 2019, డిసెంబర్లో చార్జీలు పెంచామని, ఆ తర్వాత పెంచలేదని, ప్రస్తుతం లీటరు డీజిల్ ధరల రూ.100కు చేరువైందని లెక్కలు ముందుంచి వివరించారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిందని, అయితే కోవిడ్ కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి వారిపై భారం మోపొద్దన్న ఉద్దేశంతో పెంచలేదని మంత్రి అజయ్‌కుమార్, అధికారులు వెల్లడించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటూనే ఆర్టీసీని పటిష్ట పరిచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తే కోవిడ్ నష్టం, డీజిల్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించడం, దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందించాలని సూచించారు. విద్యుత్తు చార్జీలు కూడా.. సమావేశం ముగిసే సమయంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. విద్యుత్ అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలని వారు సీఎంను కోరారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సీఎం వారికి సూచించారు. ఈ సమీక్షలో ఇందులో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్
సాక్షి, నిజామాబాద్ : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండడంతో అవకాశం రాలేదు. చిరకాల వాంఛ నెరవేరకపోfడ బాజిరెడ్డికి నిరాశ కలిగించే అంశమే.. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నాయకుడిగా ఉన్న బాజిరెడ్డి ఆది నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉంటూ వచ్చారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ 2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. మళ్లీ తాజాగా ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఈ పదవిలో నియమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. చదవండి: NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3 -
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. ప్రస్తుతం గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తనను చైర్మన్‌గా నియమించడంపై గోవర్ధన్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను వందకు వంద శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. సీఎం మార్గదర్శకత్వంలో ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తానని చెప్పారు. చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కాగా గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. గోవర్దన్ స్వస్థలం సిరికొండ మండలం రావుట్ల. పోలీస్ పటేల్ నుంచి ఆర్టీసీ చైర్మన్‌గా ఎన్నికవడం మామూలు విషయం కాదు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాక చిమన్పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1999లో ఆర్మూర్, 2004లో బాన్సువాడ, 2014, 18లో నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం సీనియర్ శాసన సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. — Telangana CMO (@TelanganaCMO) September 16, 2021 -
పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్పష్టం చేశారు. తనతో బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నారు. తాను కూడా ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని చిన్నపరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం) కేసీఆర్ కేంద్రానికి వెళ్లాలి: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధర్పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితేనే బాగుంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. యువకుడు కేటీఆర్ సీఎం అయితే బాగుంటుందని యువకులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలోనే యువ నేతల్లో కేటీఆర్ ఒకరని, ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, ముఖ్యమంత్రిగా అన్ని విధాల అర్హుడని అన్నారు. కేసీఆర్ కేంద్రానికి వెళితే బీజేపీ తప్పుడు విధానాలను ఎదిరిస్తారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంకా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు రాకుండా ఆంధ్రా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ కుట్రలను ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు పడవని తెలుసుకుని, మోడీ జపంతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ‘నేను విజయవాడలో పోటీ చేస్తే...ఆంధ్రోళ్లు ఓట్లు వేస్తారా’ ? అని ప్రశ్నించారు. అందుకే ఇక్కడ ఆంధ్రోళ్ల పార్టీకి ఓట్లు వేయవద్దని అన్నారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతి, నిర్మల్‌కు చెందిన ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీలో చేరారు.