రేపు శత వాయిద్య సమ్మేళనం
Published Tue, Jun 20 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
కాకినాడ కల్చరల్ :
ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్కళావాహిని సంగీత కళాశాల ఆధ్వర్యాన స్థానిక యంగ్‌మెన్స్ క్లబ్ ఆడిటోరియంలో (దంటు కళాక్షేత్రం) బుధవారం సాయంత్రం శత వాయిద్య సమ్మేళనం నిర్వహించనున్నట్టు సంగీత విద్వాంసుడు ఇ.శ్రీకృష్ణ తెలిపారు. ముందుగా హనుమాన్ చాలీసా సంగీత జ్ఞానయజ్ఞంతో కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. తదుపరి నాదస్వరం, వీణ, వయోలిన్, వేణువు, కీబోర్డు, మృదంగం, తబల, ఘటం, కంజీర వంటి శాస్త్రీయ శత వాయిద్యాల సమ్మేళనంతో, వందమంది కళాకారులతో శాస్త్రీయ సంగీత వాహిని కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
రేపు జిత్ సినీ సంగీతా విభావరి
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా జిత్‌మోహన్‌మిత్రా మ్యూజికల్ గ్రూపు, కాకినాడ మ్యూజికల్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం సూర్య కళామందిర్‌లో సినీ సంగీత విభావరి (తెలుగు, హిందీ) నిర్వహించనున్నట్టు జిత్‌మోహన్‌మిత్రా మ్యూజికల్ గ్రూపు కార్యదర్శి ఆర్‌వీఎస్ లీలాప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement