న్యూఢిల్లీ: అనిశ్చితిలో కొనసాగుతున్న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై ఈనెల మూడో వారంలో ఓ స్పష్టత రానుంది. ఈ పర్యటనపై చర్చించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ అధ్యక్షుడు (సీఎస్‌ఏ) క్రిస్ నెన్‌జానిని బీసీసీఐ ఆహ్వానించింది. ‘ఈ సిరీస్ గురించి పూర్తిగా చర్చించేందుకు ఇప్పటికే సీఎస్‌ఏ అధ్యక్షుడికి ఆహ్వానం పంపాను. చర్చల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా వేదిక మాత్రం ముంబై లేక చెన్నైలో జరిగే అవకాశం ఉంది.
తమ అధ్యక్షుడి షెడ్యూల్‌ను సీఎస్‌ఏ అందించాక సమావేశం తేదీలను వెల్లడిస్తాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. అయితే ఈ సమావేశంలో సీఎస్‌ఏ సీఈ హరూన్ లోర్గాట్ కూడా ఉంటారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన లేదని సమాధానమిచ్చారు. తమ ఆహ్వానం కేవలం అధ్యక్షుడికి మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. లోర్గాట్‌తో బీసీసీఐకి విభేదాలున్న విషయం తెలిసిందే.
సీఎస్‌ఏ అధ్యక్షుడికి బోర్డు ఆహ్వానం
Published Wed, Oct 9 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement