న్యూఢిల్లీ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు సోమవారం నగరానికి చేరుకుంది. ఇక్కడి నుంచి సఫారీ ఆటగాళ్లు నేరుగా తొలి మ్యాచ్ వేదిక అయిన ధర్మశాలకు వెళ్లిపోయారు. సఫారీ జట్టు వెంట క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మన్‌జ్రా కూడా ఉన్నారు. కోవిడ్–19 వైరస్ సమస్యల నేపథ్యంలో టీమ్ తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది. ముందు జాగ్రత్తగా ఈ సిరీస్ సమయంలో తమ ఆటగాళ్లెవరూ కరచాలనాలు కూడా చేయరని కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. భారత క్రికెటర్లు మాత్రం మంగళవారం ధర్మశాల వెళతారు. అంతకుముందు బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 12న (ధర్మశాల), 15న (లక్నో), 18న (కోల్‌కతా) మూడు వన్డేలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment