
సాక్షి ,ముంబై : క్రికెట్‌పై ఉన్న అభిమానాన్ని కోహ్లీ మరోసారి చాటుకున్నాడు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడిన కోహ్లీ, తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపాడు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నాడు.
జీవితంలో చాలా విలువైన దాని కోసం కొన్ని రోజులు మాత్రమే క్రికెట్‌కు దూరంగా ఉన్నానని తెలిపిన కోహ్లీ, తిరిగి క్రికెట్ ఆడటానికి సన్నద్ధమవడం ఏమాత్రం కష్టం కాదన్నాడు. జట్టు ఆటగాళ్లు ఏఒక్కరికోసమో, విదేశాలకు వెళ్లడం లేదన్నాడు. తాము దేశం తరపున ఆడటానికి మాత్రమే వెళ్తున్నామని, ఆటలో గెలవడానికి వందశాతం కృషి చేస్తామని తెలిపాడు.
కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో సిరీస్ అంటే ఒక ఛాలెంజ్ లాంటిదని, పర్యటనలో జట్టు మెత్తం రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment