
న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే అంశంపై సఫారీలకు తాము ఎటువంటి మాటివ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కేవలం ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి మాత్రమే చర్చించామని తెలిపారు. భారత్ తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకుందని గురువారం పేర్కొన్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలను ధుమాల్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం ఏ దేశంలోనూ తాము పర్యటించబోమని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment