న్యూఢిల్లీ: ఈ నెల చివర్లో శ్రీలంక వేదికగా జరగాల్సిన వన్డే, టి20 సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్–శ్రీలంక మధ్య 3 వన్డేలు, 3 టి20లు నిర్వహించాల్సి ఉంది. బీసీసీఐ దీనికి అంగీకారం తెలిపినట్లు కూడా లంక మీడియా వెల్లడించింది. అయితే కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ టూర్‌ను నిలిపివేస్తున్నట్లు బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ‘క్రికెట్ జరిగేందుకు అనువైన వాతావరణం ఇప్పుడు లేదు. ఆటగాళ్లు చాలా కాలంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిషేధం కొనసాగుతోంది. ఎప్పుడు పరిస్థితి మెరుగవుతుందో తెలీదు. జూన్–జులైలో సిరీస్ అంటే చాలా కష్టం. అందుకే ఈ పర్యటనను రద్దు చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని శ్రీలంక బోర్డుకు కూడా తెలియజేశాం. భవిష్యత్తులో ఈ రెండు సిరీస్‌లను వీలును బట్టి ఆడతాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment