న్యూఢిల్లీ : శ్రీలంకతో సిరీస్, కోహ్లి పెళ్లి సందడి అయిపోయింది. ఇప్పుడంతా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపైనే చర్చ. ఈ పర్యటనపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ అభిప్రాయం తెలియజేయగా.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ పర్యటనలో భారత్ గట్టిపొటీనిస్తుందని అభిప్రాయపడ్డారు. సిరీస్ గెలిచే అవకాశాలపై మాట్లాడుతూ.. సీనియర్ బ్యాట్స్‌మన్ సహాకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు.
‘బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న భారత జట్టుకు విజయవకాశాలున్నాయి. జట్టులో మంచి ఆల్‌రౌండర్స్, స్పిన్నర్లు, పేస్ బౌలర్లున్నారు. దక్షిణాఫ్రికాకు తొలిసారేం వెళ్లడం లేదు. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మలు ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో ఆడారు. అక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోని సన్నదమైతే విజయం సులవు.’ అని ద్రవిడ్ పేర్కొన్నారు. ప్రతీ క్రికెటర్‌కు ఓ సమయంలో లక్ కలుసోస్తుంది. అది విరాట్‌కు ఈ పర్యటనలో కలిసి రావచ్చని, కోహ్లిని ఎవరు ఆపలేరనే తాను నమ్ముతున్నట్లు ద్రవిడ్ చెప్పుకొచ్చారు.
2011లో 1-1 మినహా భారత్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. వరుస విజయాలతో ఊపు మీదున్న కోహ్లి సేన సిరీస్ గెలిచి రికార్డు నమోదు చేస్తుందని అందరు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment