లండన్: కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధంలో ఉన్న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన దాదాపుగా ఖరారైనట్టే. డిసెంబర్‌లో రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, ఓ వార్మప్ గేమ్‌తో పాటు రెండు టెస్టులు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ) అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని ఐసీసీ బోర్డు సమావేశాల సందర్భంగా ఈ టూర్‌పై ఓ అంగీకారానికి వచ్చారు.
ఈనెల 26న చెన్నైలో జరిగే బోర్డు వర్కింగ్ కమిటీలో ఈ టూర్‌ను లాంఛనంగా ప్రకటించనున్నారు. డిసెంబర్ తొలి వారంలో వన్డే సిరీస్ ప్రారంభమై బాక్సింగ్ డే టెస్టుతో పర్యటన ముగుస్తుంది. గత జూలైలో భారత్‌ను సంప్రదించకుండానే టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు సీఎస్‌ఏ సీఈ హరూన్ లోర్గాట్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనపై భారత్ విముఖంగా ఉంటూ వస్తోంది. అయితే పర్యటన రద్దయితే ఎదురయ్యే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసుకున్న సీఎస్‌ఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. లోర్గాట్‌ను లాంగ్ లీవ్‌లో పంపడమే కాకుండా భవిష్యత్‌లో బీసీసీఐతో ఎలాంటి సంప్రదింపులకు దిగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
డిసెంబర్‌లో సఫారీ పర్యటన!
Published Mon, Oct 21 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement