
ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండయాకు తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాక కెప్టెన్ విరాట్‌కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లుకురిపించారు. ‘ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. నా క్రికెట్ కెరీర్‌లో ఇండియా జట్టు ఇప్పుడు ఉన్నంతా బలంగా ఎప్పుడూ లేదు. ఇండియా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా బాగా రాణించే వాళ్లు ఉన్నారు. అంతేకాక ఆల్‌రౌండర్ హార్దికపాండ్యా సఫారీ పర్యటనలో మనకు అదనపు బలమని చెప్పవచ్చు. అతను కోహ్లికి దొరికిన ఆయుధం. అతను 7లేదా 8వ ప్లేస్‌లో కూడా వచ్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.’ అని సచిన్ పొగడ్తలతో ముంచెత్తారు.
అంతేకాక మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా సచిన్ పంచుకున్నారు. ‘ సఫరీ గడ్డపై ఇండియా జట్టు జాగ్రత్తగా ఆడి, బాగా రాణిస్తే కోహ్లి సేనకు గెలుపు ఖాయం. జట్టులోని బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు ఉమ్మడిగా రాణించాలి. ఏ టెస్టు మ్యాచ్‌లోనైనా ఫస్ట్ రోజు ఆటే ముఖ్యం. మొదటి స్పెల్‌లో బ్యాట్‍్తో లేదా బౌలింగ్‌తో ఏ జట్టు అయితే రాణిస్తుందో వారే విజయదుందుబి మోగించే అవకాశం ఎక్కువగా ఉంది.’ అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు.
కపిల్ దేవ్ సారథ్యంలో కూడా ఇండియా జట్టు ఎప్పుడు ముగ్గురు పేసర్లతో దిగడం గురించి ఆలోచన జరగలేదు. సఫారీ పిచ్‌పై బంతులు లైన్ అండ్ లెంగ్త్‌తో దూసుకోస్తాయి. అందుచేత స్లిప్‌లో ఫీల్డిండ్ ఉన్నవాళ్లు చాలా చురుకుగా ఉండాలి. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లాలు చాలా బాగా ఆడుతున్నారు. వారిని త్వరగా ఫెవిలియన్ కు పంపిస్తే టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి* అని మాస్టర్ అన్నారు.