Sachin Tendulkar:
-
Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు
ముంబై: 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అసాధ్యమనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాసి, భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు అంతర్జాతీయ కెరీర్లో 100 సెంచరీల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచిన ఈ భారత రత్నం.. తన కెరీర్లో ఆ రెండు కోరికలు నెరవేరకపోవడం ఇప్పటికీ కలచివేస్తుందని వాపోయాడు. చిన్నతనం నుంచి తన బ్యాటింగ్హీరోగా భావించే సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆడలేకపోవడాన్ని, అలాగే తను పిచ్చిగా ఆరాధించే సర్వివియన్రిచర్డ్స్ కు ప్రత్యర్ధిగా ఆడలేకపోవడాన్ని తన క్రికెటింగ్ కెరీర్లో రెండు లోటుపాట్లుగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. గవాస్కర్ రిటైర్ అయిన రెండేళ్లకు తాను క్రికెట్లోకి అరంగేట్రం చేయడం వల్ల అతనితో డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కలేదని, 80, 90 దశకాల్లో క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడికి సన్నీతో కలిసి ఆడటం అనేది ఓ కల అని సచిన్ వివరించాడు. మరోవైపు వివ్ రిచర్డ్స్‌తో కలిసి కౌంటీ క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తానని, వివ్ లాంటి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యర్ధిగా ఉంటే ఆ మజానే వేరని పేర్కొన్నాడు. తాను అరంగేట్రం చేసిన తర్వాతే వివ్ రిచర్డ్స్ రిటైర్డ్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై తామెప్పుడూ ఎదురెదురు పడలేదని, ఈ లోటు తనను జీవితాంతం బాధిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ 24 ఏళ్ల కెరీర్లో 463 వన్డేలు, 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్.. దాదాపు 35000 వేల పరుగులు సాధించాడు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్ 2021 కోసం ముందుకు జరుగనున్న సీపీఎల్..? -
‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’
న్యూఢిల్లీ: తాను ఆటగాడిగా ఎంతో మెరుగైన తర్వాత భారత జట్టులో చోటు దక్కకపోవడం నిరాశనే మిగిల్చిందని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ పేర్కొన్నాడు. తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్‌గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉందన్నాడు. 2000వ సంవత్సరంలో అరంగేట్రం చేసిన జాఫర్.. 2008లో చివరి టెస్టు ఆడాడు. తన కెరీర్లో 31 టెస్టులను మాత్రమే జాఫర్ ఆడాడు. ప్రస్తుతం ఉత్తరాఖాండ్ జట్టుకు కోచ్‌గా ఉన్న జాఫర్.. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ పలు విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ( ‘ఏబీ రిటైర్ అయ్యాడు.. ఇక భయం లేదు’) దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించిన జాఫర్‌కు భారత తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్న జాఫర్.. తాను మెరుగైన తర్వాత ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం అసంతృప్తిగా ఉందన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల్లో ఎవరు అత్యుత్తమ పరిమిత ఓవర్ల ఆటగాడు అనే దానిపై జాఫర్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. సచిన్, రోహిత్‌ల కంటే కోహ్లినే వైట్‌బాల్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడన్నాడు. ఇందుకు అతను నమోదు చేసిన గణాంకాలు, యావరేజ్‌లే కారణమన్నాడు. తాను ఆడిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీనే అత్యుత్తమం అని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభం తర్వాత కెప్టెన్సీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న గంగూలీ.. టీమిండియాకు దూకుడు నేర్పాడన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌కు పరిచయం కావడంలో గంగూలీదే క్రెడిట్ అని స్పష్టం చేశాడు. తాను నమ్మిన సహచర క్రికెటర్లకు గంగూలీ ఎప్పుడూ అండగా ఉండేవాడన్నాడు. (‘కోహ్లితో కంటే వారితో పోలికనే ఆస్వాదిస్తా’) -
‘నన్ను, అంపైర్‌ను చంపుతామన్నారు’
లండన్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ది ఒక శకం. సచిన్ ఆట కోసమే పరితపించే రోజులవి. క్రికెట్ గ్రౌండ్లోకి సచిన్ అడుగుపెడితే చాలు అతని నామస్మరణే వినిపించేంది. అంతలా క్రికెట్‌తో మమేకం అయిపోయాడు సచిన్. సచిన్ తన కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అలానే 90-100 మధ్యలో(నెర్వస్ నైన్టీస్) సచిన్ ఔట్ అయిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. మరి 100 సెంచరీ పూర్తి చేసుకునే క్రమంలో సచిన్ నెర్వస్ నైన్టీస్లో పెవిలియన్ చేరితే ఫ్యాన్స్‌కు కోపం రావడం సహజం. మరి అది ఔట్కాని ఔట్ అయితే అభిమానులకు ఎంతలా చిర్రెత్తుకొస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్రర్లేదు. అదే జరిగిందట 9 ఏళ్ల నాటి మ్యాచ్. సచిన్‌కు 100వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకోబోతున్నాడు అనే సంబరంలో ఉన్న ఫ్యాన్స్‌కు అంపైర్ రాడ్ టక్కర్ షాకిచ్చాడు. లెగ్ స్టంప్ పైనుంచి వెళుతున్న బంతిని ఔట్‌గా ఇచ్చి విమర్శల పాలయ్యాడు. అంతేకాదు చంపుతామంటూ ఫ్యాన్స్ బెదిరింపులు కూడా చవిచూశాడు. (‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’) ఈ విషయాన్ని ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ బ్రెస్నాన్ తెలిపాడు. యార్క్‌షైర్ క్రికెట్: కవర్స్ ఆఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెస్నాన్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నాడు. ‘ అది 2011లో ఓవల్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. సచిన్ 80 వద్ద నుంచి జాగ్రత్తగా ఆడటం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే 91 పరుగులకు వచ్చాడు. నేను వేసిన ఒక బంతికి సచిన్ ఔటయ్యాడు. సచిన్ ప్యాడ్లకు బంతి తగిలింది. దాంతో నేను ఔట్ కోసం అప్లై చేయడం, అంపైర్ టక్కర్ ఔట్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే లెగ్ స్టంప్ పైనుంచి వెళుతుంది. అటే సచిన్ ఔట్ కాదు. ఇలా సచిన్ ఔట్కాని ఔట్‌కు పెవిలియన్‌కు చేరడం, అది కూడా 100వ సెంచరీ చేయడం ఫ్యాన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించి ఉంటుంది. అది గడిచిన చాలా కాలం తర్వాత మాకు డెత్ వార్నింగ్స్ వచ్చాయి. ‘లెగ్ స్టంప్ మిస్సవుతున్న బంతికి అంపైర్ ఎలా ఔటిస్తాడు.. నువ్వు దాన్ని ఎలా అంగీకరించావు.. మీకెంత ధైర్యం.మిమ్ముల్ని చంపుతామంటూ బెదిరించారు’ అని బ్రెస్నాన్ తెలిపాడు. దాంతో తామిద్దరం వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులతో పాటు పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. కాగా, ఆ తర్వాత 2012లో సచిన్ తన శతకాల సెంచరీని పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.(బీబీసీకి బాయ్‌కాట్ గుడ్‌బై ) -
సచిన్‌కు కాంబ్లీ పాదాభివందనం
ముంబై: సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. వీరిద్దరూ బాల్య స్నేహితులు. ప్రధానంగా క్రికెట్లో సమకాలీకులు. ఒకే పాఠశాల, ఒకే రాష్ట్ర జట్ల తరపున ఆడటంతో పాటు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ మధ్య వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగినా ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. ముంబై టీ20 లీగ్ సందర్భంగా వీరి మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బుధవారం జరిగిన ఫైనల్లో కాంబ్లీ కోచ్‌గా వ్యవహరిస్తున్న శివాజీ పార్క్ లయన్స్ జట్టు ట్రయంప్ నైట్స్ చేతిలో ఓడింది. అవార్డుల కార్యక్రమంలో భాగంగా వేదికపై సచిన్, గావాస్కర్ ఉన్నారు. రన్నరప్ మెడల్‌ను కాంబ్లీకి గవాస్కర్ అందించాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా కాంబ్లీ పక్కనే ఉన్న తన స్నేహితుడు సచిన్ కాళ్లకు పాదాభివందనం చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సచిన్.. కాంబ్లీని లేపి గట్టిగా హత్తుకున్నాడు. -
పాండ్యా మన జట్టుకు ఒక ఆయుధం..!
ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండయాకు తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాక కెప్టెన్ విరాట్‌కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లుకురిపించారు. ‘ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. నా క్రికెట్ కెరీర్లో ఇండియా జట్టు ఇప్పుడు ఉన్నంతా బలంగా ఎప్పుడూ లేదు. ఇండియా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా బాగా రాణించే వాళ్లు ఉన్నారు. అంతేకాక ఆల్‌రౌండర్ హార్దికపాండ్యా సఫారీ పర్యటనలో మనకు అదనపు బలమని చెప్పవచ్చు. అతను కోహ్లికి దొరికిన ఆయుధం. అతను 7లేదా 8వ ప్లేస్‌లో కూడా వచ్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.’ అని సచిన్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాక మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా సచిన్ పంచుకున్నారు. ‘ సఫరీ గడ్డపై ఇండియా జట్టు జాగ్రత్తగా ఆడి, బాగా రాణిస్తే కోహ్లి సేనకు గెలుపు ఖాయం. జట్టులోని బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఉమ్మడిగా రాణించాలి. ఏ టెస్టు మ్యాచ్‌లోనైనా ఫస్ట్ రోజు ఆటే ముఖ్యం. మొదటి స్పెల్‌లో బ్యాట్్తో లేదా బౌలింగ్‌తో ఏ జట్టు అయితే రాణిస్తుందో వారే విజయదుందుబి మోగించే అవకాశం ఎక్కువగా ఉంది.’ అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు. కపిల్ దేవ్ సారథ్యంలో కూడా ఇండియా జట్టు ఎప్పుడు ముగ్గురు పేసర్లతో దిగడం గురించి ఆలోచన జరగలేదు. సఫారీ పిచ్‌పై బంతులు లైన్ అండ్ లెంగ్త్‌తో దూసుకోస్తాయి. అందుచేత స్లిప్‌లో ఫీల్డిండ్ ఉన్నవాళ్లు చాలా చురుకుగా ఉండాలి. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లాలు చాలా బాగా ఆడుతున్నారు. వారిని త్వరగా ఫెవిలియన్ కు పంపిస్తే టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి* అని మాస్టర్ అన్నారు. -
గణాంకాలే ప్రాతిపదిక కాదు
బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 35 వేల పరుగులు... వంద సెంచరీలు సాధించిన ఘనత సచిన్ టెండూల్కర్ సొంతం. అయితే గణాంకాలే అతడిని గొప్పవాడిగా చేయలేదు. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొని నిలిచి అతను జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇప్పుడు అదే తరహాలో ఈ మాస్టర్ క్రికెటర్ భవిష్యత్తు కోసం దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి ఎంపిక చేసే ముందు సెలక్టర్లు దూరదృష్టితో ఆలోచించాలని సచిన్ అభిప్రాయపడ్డాడు. కేవలం అతను సాధించిన స్కోర్లు, ఇతర గణాంకాలపై ఆధారపడకుండా ఆ క్రికెటర్ సామర్థ్యం, ఒత్తిడిని ఎదుర్కోగలిగే స్వభావాన్ని బట్టి చోటు కల్పించాలని అన్నాడు. ‘టీమ్ సెలక్షన్ అంటే స్కోరు బోర్డుపైనే ఆధారపడటం కాదు. భారీగా పరుగులు చేసిన ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. అయితే అది సరిపోదు. దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించలేకపోయిన అనేక మంది ఆటగాళ్లను నేను ఇన్నేళ్లలో చూశాను’ అని సచిన్ విశ్లేషించాడు. ఆటగాడు కొన్ని మ్యాచుల్లో విఫలమైనా... అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొని ఆడగల సామర్థ్యం కనిపిస్తే అతడిని ఎంపిక చేయాలని సచిన్ వ్యాఖ్యానించాడు. శనివారం రాత్రి జరిగిన కర్ణాటక స్టేట్ క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో తన మాజీ సహచరులు గంగూలీ, ద్రవిడ్‌లతో కలిసి సచిన్ పాల్గొన్నాడు. జిడ్డుగా ఆడితే కుదరదు... టి20 క్రికెట్ కారణంగానే టెస్టుల్లోనూ వేగం పెరిగి ఎక్కువ మ్యాచుల్లో ఫలితాలు వస్తున్నాయని సచిన్ అన్నాడు. ఏ ఆటలోనూ లేని విధంగా క్రికెట్లోనే మూడు ఫార్మాట్లు ఉన్నాయని, అది ఆటను మరింత రసవత్తరంగా మారుస్తోందన్నాడు. సీనియర్ల ఆటను చూసి నేర్చుకున్నా కుర్రాళ్లు తమ సొంత శైలిలో ఆడాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ‘ఏ ఇద్దరి టెక్నిక్ ఒకే తరహాలో ఉండదు. ఆటలో ప్రాథమికాంశాలే ముఖ్యం. విజయవంతం కావడంలో అదే ముఖ్యం’ అని అన్నాడు. టెస్టుల్లో ఎక్కువ శాతం ఫలితాలు రావడం, వన్డేల్లో 350-400 మధ్య పరుగులు రావడానికి టి20లు నేర్పిన దూకుడే కారణమని సౌరవ్ చెప్పాడు. ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని, వాటిని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళితేనే మంచి ఫలితాలు దక్కుతాయని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.