
ముంబై: సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. వీరిద్దరూ బాల్య స్నేహితులు. ప్రధానంగా క్రికెట్‌లో సమకాలీకులు. ఒకే పాఠశాల, ఒకే రాష్ట్ర జట్ల తరపున ఆడటంతో పాటు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ మధ్య వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగినా ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. ముంబై టీ20 లీగ్ సందర్భంగా వీరి మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
బుధవారం జరిగిన ఫైనల్లో కాంబ్లీ కోచ్‌గా వ్యవహరిస్తున్న శివాజీ పార్క్ లయన్స్ జట్టు ట్రయంప్ నైట్స్ చేతిలో ఓడింది. అవార్డుల కార్యక్రమంలో భాగంగా వేదికపై సచిన్, గావాస్కర్ ఉన్నారు. రన్నరప్ మెడల్‌ను కాంబ్లీకి గవాస్కర్ అందించాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా కాంబ్లీ పక్కనే ఉన్న తన స్నేహితుడు సచిన్ కాళ్లకు పాదాభివందనం చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సచిన్.. కాంబ్లీని లేపి గట్టిగా హత్తుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment