కోహ్లితో అభిమాని ఫొటో.. వైరల్‌ ! | virat kohli photo viral in social media | Sakshi
Sakshi News home page

కోహ్లికి ఆ రింగ్‌ చాలా ప్రత్యేకం..!

Published Thu, Jan 4 2018 9:36 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

virat kohli photo viral in social media - Sakshi

విరాట్‌ కోహ్లి-అనుష్కల వివాహం ఇటీవల చాలా హాట్ టాఫిక్‌ మారిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లి తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపారు. క్రికెట్‌ అంటే తనకు రక్తంతో సమానం అన్నారు. అంతేకాక పెళ్లి తనలో ఏ విధమైన మార్పు తేలేదని కోహ్లి అన్నారు. విరాట్‌ కేప్‌ టౌన్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం ఓ అభిమానితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

పెళ్లిలో అనుష్క విరాట్‌ కోహ్లి వేలికి ఉంగరం తొడిగింది. ఆ రింగ్‌ను మన కెప్టెన్‌ ఒక గొలుసుతో కలిపి మెడలో వేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. సఫారీ పర్యటనలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. రేపు (జనవరి 5న) కేప్ టౌన్ లో తొలి టెస్టు ప్రారంభకానున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement