చెన్నై: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లకుండా బీసీసీఐ తమ పంతాన్ని నెగ్గించుకునేట్లు కనిపిస్తోంది. శనివారం ఇక్కడ జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాకిస్థాన్, శ్రీలంక బోర్డుల అధికారులతో బీసీసీఐ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ రెండు దేశాలను ఆహ్వానిస్తూ ముక్కోణపు వన్డే సిరీస్ నిర్వహించే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది.
వాస్తవానికి డిసెంబర్ 11 నుంచి జనవరి 20 వరకు భారత్-శ్రీలంక మధ్య యూఏఈలో టెస్టు, వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్‌ను రద్దు చేసి ముక్కోణపు టోర్నీ జరపాలని భారత్ ప్రతిపాదిస్తోంది. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ కూడా దాదాపు ఇదే తేదీల మధ్య ఉంది. ఈ నేపథ్యంలో సఫారీ పర్యటనకు టీమిండియా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే గనుక కార్యరూపం దాలిస్తే ఇక భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ రద్దయినట్లే!
సందిగ్ధంలో దక్షిణాఫ్రికా పర్యటన!
Published Sat, Sep 14 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement