ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) కసరత్తులు చేస్తోంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉండగా.. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- ఎస్‌ఆర్‌హెచ్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. కాగా జోహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకున్న సీఎస్‌కే నుంచి ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
సీఎస్‌కే తరపున విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన ఎంఎస్ ధోని సౌతాఫ్రికా టి20లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్‌కేతో ఉన్న అనుబంధం దృశ్యా ప్రొటిస్ టి20 లీగ్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే మాత్రం సీఎస్‌కే కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్‌లో ధోని ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కేలో కొనసాగిన ధోని జట్టును నాలుగుసార్లు విజేతగా(20210, 2011,2018, 2021).. మరో ఐదుసార్లు రన్నరప్‌గా(2008,2012,2013,2015,2019) నిలిపాడు. 2010, 2014లో ధోని సీఎస్‌కేకు చాంపియన్స్ లీగ్ టి20 టైటిల్స్ అందించాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. కానీ అంచనాలకు భిన్నంగా దారుణంగా విఫలమైన సీఎస్‌కే నిరాశపరిచింది. దీంతో సీజన్ మధ్యలోనే జడ్డూ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మళ్లీ ధోనినే కెప్టెన్సీ అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనికి ఆఖరిదని అంతా భావించినప్పటికి.. ఆ వార్తలను ఖండించిన ధోని తర్వాతి సీజన్‌లోనూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు.
చదవండి: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే..
Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment