Cricket South Africa Announces New Six Team Franchise Based T20 Competition - Sakshi
Sakshi News home page

క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్ త‌ర‌హాలో మ‌రో లీగ్‌

Published Sat, Apr 30 2022 6:09 PM | Last Updated on Sat, Apr 30 2022 6:34 PM

Cricket South Africa Announces New Six Team Franchise Based T20 Competition - Sakshi

క్రికెట్ ప్రేమికుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో ఇండియ‌న్  ప్రీమియ‌ర్ లీగ్ త‌ర‌హాలో మ‌రో టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ క్రికెట్ సౌతాఫ్రికా ఆధ్వ‌ర్యంలో జ‌రుగ‌నుంది. మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొనే ఈ లీగ్‌ను వచ్చే ఏడాది (2023) జనవరిలో నిర్వహించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఒక్కో జ‌ట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయి. ఇక్క‌డ ఈ మూడు జట్లు ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ స్టేజీలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన రెండు జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి. 

3 నుంచి 4 వారాల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 33మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ త‌ర‌హాలో ఈ లీగ్‌లోనూ ప్రతి జట్టులో నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు (విదేశీ) ఉంటారు. వేలం ప్ర‌క్రియ ద్వారా ఆట‌గాళ్ల కొనుగోలు జ‌రుగుతుంది. వేలం తేదీలు, మ్యాచ్‌ల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


ఈ లీగ్ విజ‌య‌వంత‌మైతే తదనంతరం మహిళల టీ20 లీగ్ కూడా ప్రారంభిస్తామ‌ని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. కాగా, ఐపీఎల్ త‌ర‌హాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్,  ఇంగ్లండ్ దేశాల్లో ఇదివ‌ర‌కే టీ20 లీగ్‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 

చ‌ద‌వండి: రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement