జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ బృందంలో ముగ్గురు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు కాగా ఒకరు సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటన కోసం సోమవారం నుంచి మహిళల క్రికెట్ శిక్షణా శిబిరం జరగాల్సి ఉండగా... ప్రాక్టీస్ సెషన్ నుంచి ఈ ముగ్గురిని తప్పించినట్లు సీఎస్‌ఏ వెల్లడించింది. పాజిటివ్‌గా తేలిన ముగ్గురిలోనూ అతి స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని పేర్కొన్న సీఎస్‌ఏ రానున్న పది రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొంది. అనంతరం తమ వైద్య బృందం పరీక్షించాకే వారు ప్రాక్టీస్‌లో పాల్గొంటారని చెప్పింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ శిబిరానికి హాజరయ్యే క్రికెటర్ల బృందానికి 34 రకాల పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్‌ఏ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment