IND Vs SA T20: Aiden Markram Ruled Out Of Remaining Two T20I Against India - Sakshi
Sakshi News home page

IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు దూరం..!

Published Thu, Jun 16 2022 10:54 AM | Last Updated on Thu, Jun 16 2022 1:00 PM

South Africas Aiden Markram ruled out of remaining T20s against India - Sakshi

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ టీమిండియాతో జరిగిన తొలి మూడు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన రెండు టీ20లకు కూడా మార్క్రామ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ దక్షిణాఫ్రికా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. తొలి టీ20కు ముందు మార్క్రామ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే గత ఏడు రోజులుగా ఐషోలేషన్‌లో ఉన్న మార్క్రామ్ ఇంకా కొవిడ్‌ నుంచి కోలుకోలేనట్లు తెలుస్తోంది. 

"మార్క్రామ్‌కు పాజిటివ్‌గా తేలిన తర్వాత  7 రోజులు క్వారంటైన్‌లో గడిపాడు. అయితే అతడు ఇంకా కోలుకోలేదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు" అని క్రికెట్‌ దక్షిణాఫ్రికా ట్వీట్‌ చేసింది. ఇక గాయం కారణంగా గత రెండు టీ20లకు దూరమైన ప్రోటిస్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ నాలుగో టీ20కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు ఇక రాజ్‌కోట్‌ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్‌ దూరం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement