రూ.320 కోట్ల నూడుల్స్ ధ్వంసం
న్యూఢిల్లీ : మ్యాగీ నూడుల్స్ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకుని, ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు నిన్న తెలిపింది. మార్కెట్, వ్యాపార భాగస్వాముల వద్ద ప్రస్తుతం రూ.210 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని, ఫ్యాక్టరీలు, పంపిణీ కేంద్రాల్లో మరో రూ.110 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి వెల్లడించింది.
మ్యాగీ నూడుల్స్ లో సీసం, రుచిని పెంచే మోనోసోడియం గ్లుటామేట్ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉండటంతో భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ ఈ నెల 5న నిషేధం విధించి, వాటిని మార్కెట్ నుంచి వాపసు తీసుకోవాలని ఆదేశించడం, నిషేధంపై స్టే ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించడం తెలిసిందే. దాంతో వెనక్కి తీసుకున్న మ్యాగీ నూడుల్స్ నిల్వలను అయిదు సిమెంట్ ఫ్యాక్టరీలలో కాల్చివేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.