చికెన్‌ నూడుల్స్‌ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా! | Sakshi
Sakshi News home page

చికెన్‌ నూడుల్స్‌ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!

Published Fri, Feb 9 2024 10:08 AM

How to make tasty chicken noodles - Sakshi

చికెన్‌ సూప్‌ మీద మనసుపోతే రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందేనా? ఫైవ్‌స్టార్‌ హోటల్‌ రేంజ్‌లో చికెన్‌ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్‌కి చికెన్‌ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే  వీటన్నింటినీ  ఎలా  చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా   చికు బుకు చికు బుకు... చికెనే!  అంటూ  లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు  చికెన్‌ నూడల్స్‌ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి!

చికెన్‌ నూడుల్స్‌
కావలసినవి:  చికెన్‌ – 200 గ్రాములు (బోన్‌లెస్‌); నూడుల్స్‌ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
మారినేట్‌ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్‌; ఉప్పు – పావు టీ స్పూన్‌; సోయా సాస్‌ – టీ స్పూన్‌; గరం మసాలా పౌడర్‌ – టీ స్పూన్‌;
పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్‌లు; క్యాప్సికమ్‌ ముక్కలు – పావు కప్పు; క్యారట్‌ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్‌ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్‌– టేబుల్‌ స్పూన్‌; సోయాసాస్‌ – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – రుచికి తగినంత.


తయారీ:  ∙చికెన్‌ను సన్నని పొడవు ముక్కలుగా కట్‌ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్‌ వేసి ఉడికించాలి. నూడుల్స్‌ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్‌ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్‌ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్‌ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్‌లో మరో టీ స్పూన్‌ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి.

క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి.  ఇప్పుడు స్టవ్‌ మీద  వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్‌ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్‌ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్‌ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్‌లో కలపాలి. చికెన్‌ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి.

ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్‌ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి.  అంతే  వేడి వేడి చికెన్‌ నూడుల్స్‌రడీ..!

Advertisement
 
Advertisement
 
Advertisement