
మంగళసూత్రంతో పరారీ
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. స్తానిక మారుతీ నగర్ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో మంగళసూత్రం లాక్కో బోతుండగా ఆమె భర్త పుల్లారావు అడ్డుకోబోయాడు. ఇంతలో మరో దొంగ పుల్లారావు తలపై బలంగా కొట్టడంతో కుప్ప కూలిపోయాడు. దీంతో సత్యవతి కేకలు వేయగా దొంగలు చేతికందిన మంగళసూత్రంతో పరారయ్యారు. పుల్లారావును ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చింతలపూడి సిఐ జి దాసు, ఎస్‌ఐ వీఎస్ వీరభద్రరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు