చింతలపూడి :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామం ఎర్రచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయ్యింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.