
సాక్షి, ఏలూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సార్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో వైఎస్సార్‌సీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడిలో ఆ పార్టీ నాయకుడు వీఆర్ ఎలీజా వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యలర్తలతో కలిసి ‘యాత్ర’ బెనిఫిట్ షోను వీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్ర సినిమా చాలా బాగుందన్నారు. ప్రజల గుండెలకు హత్తుకునేలా సినిమా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడారు. పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సార్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగిన సినిమాగా యాత్రను రూపొందించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment