ఓటేసే ముందు రాజన్నరాజ్యాన్ని గుర్తుతెచ్చుకోండి | YS vijyamma road show in dharmajigudem | Sakshi
Sakshi News home page

ఓటేసే ముందు రాజన్నరాజ్యాన్ని గుర్తుతెచ్చుకోండి

Published Wed, Apr 16 2014 10:21 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఓటేసే ముందు రాజన్నరాజ్యాన్ని గుర్తుతెచ్చుకోండి - Sakshi

ఓటేసే ముందు రాజన్నరాజ్యాన్ని గుర్తుతెచ్చుకోండి

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు ఒక్క జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.

ఏలూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు ఒక్క జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావం పూరించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విజయమ్మ రోడ్ షో ప్రారంభం అయ్యింది.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షించాలని, ఓటేసే ముందు ఒక్కసారి రాజన్య రాజ్యాన్ని గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని కుంభకోణాలేనని విజయమ్మ అన్నారు. అనంతరం చింతలపూడిలో జరిగే జనభేరి సభలో మాట్లాడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement