
'ప్రజలను మోసగించడంలో బాబు ఆరితేరారు'
ఏలూరు: ప్రజలను మోసగించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం చింతలపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...గోదావరి పుష్కరాల పేరుతో రూ.1800 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైనాయన్నారు.
పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనపై విచారణ ఏమైందని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.