రాష్ట్ర స్థాయి పోటీల్లో సుధాకర్‌కు గోల్డ్ మెడల్
చింతలపూడి : స్థానిక బీవీఎం ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోడూరి సుధాకర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. ఈ నెల 5,6 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన పోటీల్లో 400/100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా తరపున పాల్గొని ప్రథమస్థానంలో నిలిచాడు. టి.నరసాపురం మండలం, బొర్రంపాలెం గ్రామానికి చెందిన సుధాకర్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. సుధాకర్‌ను కళాశాల కార్యదర్శి ఎ.పవన్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.