చింతలపూడి (పశ్చిమ గోదావరి) : వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ధర్మాజీగూడెంకు చెందిన షేక్ వలీ, మురళీలు వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు తమ్మిలేరు ప్రాజెక్టులోపడి మృత్యువాతపడ్డారు.