చింతలపూడి : పండగపూట ఆ ఊరిలో విషాదం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులూ కలిసి తిరిగిన స్నేహితులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగపాలెం మండలం శింగగూడెం గ్రామానికి చెందిన పి.శివాజి (16), గోపాలకృష్ణ, భూపతిరావు ముగ్గురు స్నేహితులు.
గ్రామంలో పదో తరగతి చదువుతున్నారు. పండగ సందర్భంగా సరదాగా కలిసి మెలిసి తిరిగారు. శనివారం కనుము రోజు ద్విచక్ర వాహనంపై చింతలపూడి సినిమా చూడటానికి వచ్చారు. రెండో ఆట సినిమా చూసి అర్ధరాత్రి ఇంటికి బయలు దేరారు. వెలగలపల్లి సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం చెట్టును ఢీ కొట్టడంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన గోపాలకృష్ణను మెరుగైన చికిత్స కోసం విజయవాడ, భూపతిరావును ఏలూరు తరలించారు. ఎస్సై సైదా నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు..
Published Mon, Jan 18 2016 1:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement