కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో గురువారం జరిగింది.
చింతలపూడి (పశ్చిమగోదావరి) : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజశేఖర్(22) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
అయితే గురువారం ఉదయం గ్రామ సమీపంలోని జామతోటలో చెట్టుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.