రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం
Published Sat, Jul 15 2017 2:24 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ దుర్మరణం చెందారు. ఆయన తన భార్య, రెండేళ్ల కూతురితో కలిసి కారులో ఏలూరుకు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సైదానాయక్ కారు నడుపుతున్నారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement