
సాక్షి, చిత్తూరు : శ్రీకాళహస్తిలో భూ వివాదాలు కలకలం రేపుతున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి ఇద్దరు దళిత యువకులపై హత్యాయత్నం జరగడం పట్టణంలో కలవరం పుట్టిస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్‌ఎమ్ వాడకు చెందిన కిరణ్,నరసింహులు అనే యువకులు పిచ్చాటూరు మార్గంలో రాజీవ్ నగర్ సమీపంలో వెళ్తుండగా వారిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులను హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కు తరలించారు. యువవకులకు ఏరియా హాస్పిటల్ లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. బాధితులు కిరణ్ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ.. తమపై అగ్రవర్ణాలకు చెందిన వారు హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. పట్టణంలోని దళితులకు చెందిన భూమి ఆక్రమించుకోవడంతో తాము అభ్యంతరం చెప్పగా తమపై హత్యా ప్రయత్నం చేయించారని వాపోయారు. (వైద్యం పేరుతో వికృత చేష్టలు )
Comments
Please login to add a commentAdd a comment