సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్‌లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సయ్యద్ అబ్దుల్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సెంట్రల్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 14 షేక్‌పేట్ మండలంలోని 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు సయ్యద్ అబ్దుల్ ప్రయత్నించినట్లుగా విచారణలో తేలింది. ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ స్థలం తనదేనంటూ రెవెన్యూ అధికారులకు తప్పుడు ఆధారాలు చూపించినట్లు గుర్తించారు. గతంలో ఈ భూ వివాదంలో బంజారాహిల్స్ ఎస్ఐ తో పాటు షేక్‌పేట్ ఎమ్మార్వో, ఆర్ఐను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment