
చామకూర మల్లారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ, టీఆర్‌ఎస్ నాయకుడు చామకూర మల్లారెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి స్పీకర్ అభినందనలు తెలిపారు. తాజాగా ముగిసిన తెలంగాణ శానససభ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఆయన భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 87,990 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తెలంగాణ కొత్త మంత్రి మండలిలో మల్లారెడ్డికి చోటు దక్కనుందని ప్రచారంలో జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment