Malkajgiri MP
-
మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంభీపూర్ రాజు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి అభ్యర్థత్వాన్ని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచింది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను సంప్రదించి..శంభీపూర్ రాజు అభ్యర్థత్వానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఇదే విషయాన్ని మంగళవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రాజుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికలకు రెడీగా ఉండాలని..అన్ని విధాలా పార్టీ సహకరిస్తుందనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్లోనే ఉంటూ..కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్ రాజు..కేసీఆర్ కుటుంబానికి నమ్మినబంటుగా పేరొందాడు. -
Revanth Reddy: సమరానికి సై!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ రేవంతరెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టటంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. అదే ఉత్సాహాన్ని జిల్లాలో కొనసాగించేందుకు యువత, మహిళలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు వారు ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై ఫోకస్ పెంచి సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతానికి కేడర్‌ను సిద్ధం చేసేందుకు డీసీసీ యోచిస్తున్నది. జిల్లా స్థాయి నుంచి డివిజన్, వార్డు, గ్రామ స్థాయి వరకు ప్రజా సమస్యలను గుర్తించి, పాలకవర్గాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జోడించి ఆయా స్థాయిల్లో దశలవారీ ఆందోళనకు కేడర్, నాయకులు నడుంబిగించేలా కార్యాచరణ ఖరారుకు చర్యలు తీసుకుంటుంది. గ్రేటర్ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, శివారులోని మరో నియోజకవర్గంలో ప్రజాందోళనలు బలంగా నిర్వహించటం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్టను పెంచాలనుకుంటుంది. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న నాయకులు, కేడర్‌ను ఆయా కమిటీల్లో ఇముడ్చుకునేందుకు జిల్లా నుంచి క్షేత్ర స్థాయి వరకు కమిటీల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నది. వ్యూహప్రతి వ్యూహాలతో... ► మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తాజాగా భేటీ నిర్వహించి సంస్థాగత బలోపేతానికి చేపట్టాల్సిన కసరత్తు, వ్యూహ, ప్రతి వ్యూహాలు, బలం, బలహీనతలు, కమిటీల పునరుద్ధరణ, ఆందోళన కార్యక్రమాలు, నాయకులు, కేడర్ గుర్తింపు, పారీ్టలో చిన్నాపెద్ద తేడా లేకుండా సమష్టిగా పని చేయటం వంటి విషయాలపై చర్చించారు. ► జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి ఒక జడ్పీటీసీ సభ్యుడిసహా ఇద్దరు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యాక్షులు, 11 మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు సర్పంచులు , 15 మంది కార్పొరేటర్లు, 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. శివారుల్లో పార్టీ బలపడటానికి గట్టి నాయకత్వం ఉండగా, గ్రేటర్లో నాయకులు, కేడర్‌ను పెంచుకోవాల్సిన అంశంపై ఇష్టాగోష్టిలో చర్చించారు. ►టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడ్చల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందుకు తగినట్టుగా సంస్థాగత బలోపేతం, ప్రజాందోళనలు, నాయకులు, కేడర్ పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయన హుందాతనాన్ని మరింత పెంచాలని పలువురు నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 12న ఉప్పల్‌లో చేపట్టనున్న ర్యాలీతోపాటు 16న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను ముఖ్యంగా యువత, మహిళలను సమీకరించటం ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ►అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలను ఫోకస్ చేస్తూ.. వరుస క్రమంలో ఆందోళనలు చేపట్టేందుకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
ఎంపీ పదవికి టీఆర్ఎస్ నేత మల్లారెడ్డి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: మల్కాజ్గిరి ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు చామకూర మల్లారెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి స్పీకర్ అభినందనలు తెలిపారు. తాజాగా ముగిసిన తెలంగాణ శానససభ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఆయన భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 87,990 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తెలంగాణ కొత్త మంత్రి మండలిలో మల్లారెడ్డికి చోటు దక్కనుందని ప్రచారంలో జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
'మహేష్ బాబు అంటే ఇష్టం'
హైదరాబాద్: 'ప్రిన్స్' మహేష్ బాబుకు అమ్మాయిలే కాదు రాజకీయ నాయకులు అభిమానులుగా మారిపోతున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరికి ప్రాతినిథ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి- మహేష్ ఫ్యాన్ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్‌బాబు తన అభిమాన నటుడని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. మహేష్ సినిమాలంటే చాలా ఇష్టమని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక హిందీలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ తన అభిమాన నటీనటులని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు పిల్లలతో కలిసి ప్రతి ఆదివారం సినిమాకు వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. 61 ఏళ్ల మల్లారెడ్డి తొలి ప్రయత్నంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ అయ్యారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)