
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి అభ్యర్థత్వాన్ని ఖరారు చేస్తూ బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచింది.
నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను సంప్రదించి..శంభీపూర్ రాజు అభ్యర్థత్వానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఇదే విషయాన్ని మంగళవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రాజుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికలకు రెడీగా ఉండాలని..అన్ని విధాలా పార్టీ సహకరిస్తుందనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ..కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్ రాజు..కేసీఆర్ కుటుంబానికి నమ్మినబంటుగా పేరొందాడు.
Comments
Please login to add a commentAdd a comment