Shambhipur Raju
-
మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంభీపూర్ రాజు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి అభ్యర్థత్వాన్ని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచింది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను సంప్రదించి..శంభీపూర్ రాజు అభ్యర్థత్వానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఇదే విషయాన్ని మంగళవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రాజుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికలకు రెడీగా ఉండాలని..అన్ని విధాలా పార్టీ సహకరిస్తుందనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్లోనే ఉంటూ..కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్ రాజు..కేసీఆర్ కుటుంబానికి నమ్మినబంటుగా పేరొందాడు. -
Telangana: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్!
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రోజు ఎమ్మెల్సీ రాజు వర్గానికి చెందిన ఏ ఒక్కరూ ప్రజాప్రతినిధి, నాయకులు హాజరు కాకపోవడం చర్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద హాజరైనా ఈ కార్యక్రమానికి శంభీపూర్‌రాజు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మరింత దూరం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఆహా్వనం లేదని ఎమ్మెల్సీ వర్గం.. ఉన్నా కావాలనే తప్పించుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకున్నా... కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ వర్గీయులు మొత్తం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఒకరికి ఒకరు దొరక్కుండా దోబూచులాడారు. చివరకు ఎమ్మెల్సీ రాజు ఇంట్లో ఎమ్మెల్యే వివేకానంద భేటీ కావడంతో ఇక సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఇలా జరిగిందని పుకార్లు షికారులు చేశాయి. ► కానీ ఈ నెల 2 తేదీన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించే విషయంలో జరిగిన బహిరంగ సభకు ఇటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గాని అటు నిజాంపేట కార్పొరేషన్ ౖచైర్మన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, కౌన్సిలర్లు ఏ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేయడం కావాలనే ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు స్పష్టమైంది. ‘భీఫాం’పైనే... ఇప్పుడు హాట్ టాపిక్.! కుత్బుల్లాపూర్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌కు మూడోసారి అవకాశం కలి్పస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డిలోమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న నెపంతో అంటిముట్టునట్లుగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ రాగా కుత్బుల్లాపూర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ►ఎమ్మెల్సీ రాజు వర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శంభీపూర్ రాజుకే టికెట్ వస్తుందని ప్రచారం కలి్పస్తూ అభ్యరి్థగా ప్రకటించిన వివేకానంద్‌కు బీ–ఫాం ఇవ్వరని చెబుతూ రావడం ఇప్పుడు స్థానికంగా చర్చగా మారుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో సైతం ఎడమొహం.. పెడమొహం గానే మాట్లాడుకొని రెండు గంటలసేపు ఉన్నప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వీరివివాదంపై దృష్టి సారించే వరకు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
మైనంపల్లికి ప్రత్యామ్నాయం!.. తెరమీదకు మర్రి,శంభీపూర్ రాజు పేర్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. అసంతృప్తి, అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయడానికి కూడా వెనుకాడేది లేదన్న సంకేతాలను ఇస్తోంది. ఈ సమయంలో మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు మంగళవారం సైతం.. తన కుమారునికి మెదక్ టికెట్ విషయంలో తాను పార్టీ పై కాని, సీఎంపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తనను ఎవరు టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడడం, హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానంటూ వ్యాఖ్యానించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం చేయడం, అదే సమయంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం సంబంధిత అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే యత్నాలు చేస్తూనే, పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తెరపైకి కొత్తపేర్లు మైనంపల్లి స్థానంలో ఇతరులకు టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మండలి సభ్యుడు శంభీపూర్ రాజు, పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యరి్థగా ప్రకటించడంపైనా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. మైనంపల్లికి కాంగ్రెస్ ఆఫర్! తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక కేడర్‌కు అందుబాటులోకి రాలేదు. ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజిగిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్‌రాజు గురువారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. -
గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు టీఆర్ఎస్ జిల్లా శాఖలకు అధ్యక్షులొచ్చారు. సుదీర్ఘకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా గులాబీ బాస్ కొత్త సారథులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నవారికి అప్పగిస్తారని భావించినా.. అంచనాలు తలకిందులు చేస్తూ మూడు జిల్లాలకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలనే ఖరారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు ఎమ్మెల్యేలకు, ఒకటి ఎమ్మెల్సీకి దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియమితులయ్యారు. ఇక త్వరలోనే జిల్లా, డివిజన్ల పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. (క్లిక్: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే) ముగ్గురూ ముగ్గురే.. ► అధ్యక్షులుగా నియమితులైనవారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. గోపీనాథ్, కిషన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1985లో తెలుగుయువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో హుడా డైరెక్టర్‌గా, 1988 వినియోగదారుల ఫోరం తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్లోకి రాకముందు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ► మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన మంచిరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ తదితర హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గులాబీ దళపతికి సన్నిహితుడిగా పేరుంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి లభించింది. అదృష్టంగా భావిస్తున్నా పార్టీ సభ్యత్వ నమోదు నుంచి అధిష్టానం అప్పగించిన ఏపనైనా నిబద్ధతతో, సిస్టమేటిక్‌గా చేస్తున్నా. ఎంతో కీలకమైన, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా.. అందరినీ కలుపుకొని నడుచుకుంటాను. – మాగంటి గోపీనాథ్ సమన్వయంతో పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయంతో పనిచేస్తా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవముంది. నాపై నమ్మకముంచి బాధ్యతలప్పగించిన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా. మరింత కష్టపడి పనిచేస్తా. పార్టీ బలోపేతానికి పాటు పడతా. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తిరుగులేని మెజార్టీకి కృషి కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాలకనుగుణంగా పని చేస్తా. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వార్డు, డివిజన్, పట్టణ, మండల, జిల్లాస్థాయిలో పార్టీకోసం పనిచేసే వారికి తగిన పదవులు లభించేలా చూస్తా. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజార్జీతో గెలిచేలా కృషి చేస్తా. – శంభీపూర్ రాజు -
కాంగ్రెస్ నేతలవి అర్థంలేని ఆరోపణలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, అందుకే మంత్రి కేటీఆర్ మీద అర్థం పర్థం లేని ఆరోపణలకు దిగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్ అబద్ధాలకు పరాకాష్ట అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాసోజు శ్రవణ్ వంటి వారు కేటీఆర్‌ను తిడితే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడి ఏదో ఒక పదవి దక్కక పోతుందా అనే ఆత్రుతతో చవకబారు ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసు వాహనాల కొనుగోలులో హిమాన్షు మోటార్స్‌కు లబ్ధి చేకూరినట్టు ఒక్క ఆధారమైనా చూపగలరా అని సవాల్ విసిరారు. తప్పుడు పత్రాలు విడుదల చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నేరెళ్ల ఘటనపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో అణగారిన వర్గాలపై జరిగిన దాడులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.