కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు | Congress leaders are absurd allegations | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు

Published Thu, Jul 27 2017 1:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు - Sakshi

కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు  
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, అందుకే మంత్రి కేటీఆర్‌ మీద అర్థం పర్థం లేని ఆరోపణలకు దిగుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ అబద్ధాలకు పరాకాష్ట అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాసోజు శ్రవణ్‌ వంటి వారు కేటీఆర్‌ను తిడితే కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో పడి ఏదో ఒక పదవి దక్కక పోతుందా అనే ఆత్రుతతో చవకబారు ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

పోలీసు వాహనాల కొనుగోలులో హిమాన్షు మోటార్స్‌కు లబ్ధి చేకూరినట్టు ఒక్క ఆధారమైనా చూపగలరా అని సవాల్‌ విసిరారు. తప్పుడు పత్రాలు విడుదల చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నేరెళ్ల ఘటనపై మొసలి కన్నీళ్లు కారుస్తున్న కాంగ్రెస్‌ నేతలు తమ హయాంలో అణగారిన వర్గాలపై జరిగిన దాడులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement