కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రోజు ఎమ్మెల్సీ రాజు వర్గానికి చెందిన ఏ ఒక్కరూ ప్రజాప్రతినిధి, నాయకులు హాజరు కాకపోవడం చర్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద హాజరైనా ఈ కార్యక్రమానికి శంభీపూర్‌రాజు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మరింత దూరం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఆహా్వనం లేదని ఎమ్మెల్సీ వర్గం.. ఉన్నా కావాలనే తప్పించుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకున్నా...
కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ వర్గీయులు మొత్తం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఒకరికి ఒకరు దొరక్కుండా దోబూచులాడారు. చివరకు ఎమ్మెల్సీ రాజు ఇంట్లో ఎమ్మెల్యే వివేకానంద భేటీ కావడంతో ఇక సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఇలా జరిగిందని పుకార్లు షికారులు చేశాయి.
► కానీ ఈ నెల 2 తేదీన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించే విషయంలో జరిగిన బహిరంగ సభకు ఇటు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు గాని అటు నిజాంపేట కార్పొరేషన్ ౖచైర్మన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, కౌన్సిలర్లు ఏ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేయడం కావాలనే ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు స్పష్టమైంది.
‘భీఫాం’పైనే... ఇప్పుడు హాట్ టాపిక్.!
కుత్బుల్లాపూర్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌కు మూడోసారి అవకాశం కలి్పస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డిలోమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న నెపంతో అంటిముట్టునట్లుగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ రాగా కుత్బుల్లాపూర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
►ఎమ్మెల్సీ రాజు వర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శంభీపూర్ రాజుకే టికెట్ వస్తుందని ప్రచారం కలి్పస్తూ అభ్యరి్థగా ప్రకటించిన వివేకానంద్‌కు బీ–ఫాం ఇవ్వరని చెబుతూ రావడం ఇప్పుడు స్థానికంగా చర్చగా మారుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో సైతం ఎడమొహం.. పెడమొహం గానే మాట్లాడుకొని రెండు గంటలసేపు ఉన్నప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వీరివివాదంపై దృష్టి సారించే వరకు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment