Quthbullapur Assembly Constituency
-
‘హ్యాట్రిక్’ హీరో కేపీ వివేకానంద్
ఎమ్మెల్యేగా వివేకానంద్ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్’ సాధించారు. గతంలో మేడ్చల్‌లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు. కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్ ఘనవిజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు. హ్యాట్రిక్ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా.. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్‌కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరూ హ్యాట్రిక్ వీరులే.. కుత్బుల్లాపూర్: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఒకటి నుంచి 22వ రౌండ్ వరకు వివేకానంద్ ఆధిపత్యం కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్ (బీఆర్ఎస్)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్ హన్మంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్ నుంచి 22 రౌండ్ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
Telangana: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్!
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రోజు ఎమ్మెల్సీ రాజు వర్గానికి చెందిన ఏ ఒక్కరూ ప్రజాప్రతినిధి, నాయకులు హాజరు కాకపోవడం చర్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద హాజరైనా ఈ కార్యక్రమానికి శంభీపూర్‌రాజు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మరింత దూరం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఆహా్వనం లేదని ఎమ్మెల్సీ వర్గం.. ఉన్నా కావాలనే తప్పించుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకున్నా... కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ వర్గీయులు మొత్తం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఒకరికి ఒకరు దొరక్కుండా దోబూచులాడారు. చివరకు ఎమ్మెల్సీ రాజు ఇంట్లో ఎమ్మెల్యే వివేకానంద భేటీ కావడంతో ఇక సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఇలా జరిగిందని పుకార్లు షికారులు చేశాయి. ► కానీ ఈ నెల 2 తేదీన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించే విషయంలో జరిగిన బహిరంగ సభకు ఇటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గాని అటు నిజాంపేట కార్పొరేషన్ ౖచైర్మన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, కౌన్సిలర్లు ఏ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేయడం కావాలనే ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు స్పష్టమైంది. ‘భీఫాం’పైనే... ఇప్పుడు హాట్ టాపిక్.! కుత్బుల్లాపూర్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌కు మూడోసారి అవకాశం కలి్పస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డిలోమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న నెపంతో అంటిముట్టునట్లుగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ రాగా కుత్బుల్లాపూర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ►ఎమ్మెల్సీ రాజు వర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శంభీపూర్ రాజుకే టికెట్ వస్తుందని ప్రచారం కలి్పస్తూ అభ్యరి్థగా ప్రకటించిన వివేకానంద్‌కు బీ–ఫాం ఇవ్వరని చెబుతూ రావడం ఇప్పుడు స్థానికంగా చర్చగా మారుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో సైతం ఎడమొహం.. పెడమొహం గానే మాట్లాడుకొని రెండు గంటలసేపు ఉన్నప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వీరివివాదంపై దృష్టి సారించే వరకు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
కుత్బుల్లాపూర్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన వివేకానందగౌడ్ మరోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మీద 41500 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. వివేక్ కు 154500 ఓట్లు రాగా, శ్రీశైలంకు 113000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి కాసాని వీరేష్‌కు 9800 పైచిలుకు ఓట్లు వచ్చాయి. వివేక్ సామాజికవర్గ పరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో వివేకానంద గౌడ్ టిఆర్ఎస్ అభ్యర్ధి కె.హనుమంతరెడ్డిపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందగౌడ్ 2009లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయి, 2014లో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్దిగా విజయం సాదించడం విశేషం. తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2009లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందిన శ్రీశైలం గౌడ్ 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఇంతవరకు గెలిచినవారంతా బీసి గౌడ్ వర్గం వారే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..