MLA Vivekanand
-
Telangana: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్!
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రోజు ఎమ్మెల్సీ రాజు వర్గానికి చెందిన ఏ ఒక్కరూ ప్రజాప్రతినిధి, నాయకులు హాజరు కాకపోవడం చర్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద హాజరైనా ఈ కార్యక్రమానికి శంభీపూర్‌రాజు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మరింత దూరం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఆహా్వనం లేదని ఎమ్మెల్సీ వర్గం.. ఉన్నా కావాలనే తప్పించుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకున్నా... కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ వర్గీయులు మొత్తం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఒకరికి ఒకరు దొరక్కుండా దోబూచులాడారు. చివరకు ఎమ్మెల్సీ రాజు ఇంట్లో ఎమ్మెల్యే వివేకానంద భేటీ కావడంతో ఇక సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఇలా జరిగిందని పుకార్లు షికారులు చేశాయి. ► కానీ ఈ నెల 2 తేదీన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించే విషయంలో జరిగిన బహిరంగ సభకు ఇటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గాని అటు నిజాంపేట కార్పొరేషన్ ౖచైర్మన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, కౌన్సిలర్లు ఏ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేయడం కావాలనే ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు స్పష్టమైంది. ‘భీఫాం’పైనే... ఇప్పుడు హాట్ టాపిక్.! కుత్బుల్లాపూర్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌కు మూడోసారి అవకాశం కలి్పస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డిలోమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న నెపంతో అంటిముట్టునట్లుగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ రాగా కుత్బుల్లాపూర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ►ఎమ్మెల్సీ రాజు వర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శంభీపూర్ రాజుకే టికెట్ వస్తుందని ప్రచారం కలి్పస్తూ అభ్యరి్థగా ప్రకటించిన వివేకానంద్‌కు బీ–ఫాం ఇవ్వరని చెబుతూ రావడం ఇప్పుడు స్థానికంగా చర్చగా మారుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో సైతం ఎడమొహం.. పెడమొహం గానే మాట్లాడుకొని రెండు గంటలసేపు ఉన్నప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వీరివివాదంపై దృష్టి సారించే వరకు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
బంగారు తెలంగాణ బాటలు కనిపిస్తలేవా?
సాక్షి, హైదరాబాద్: ‘బంగారు తెలంగాణ’పై గురువారం శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది. గురుకుల పాఠశాలలపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుడు వివేకానంద మాట్లాడారు. తన ప్రసంగంలో పలుమార్లు ‘బంగారు తెలంగాణ’పదాన్ని ఉచ్ఛరించారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇందాక వివేకానంద తన ప్రసంగంలో 20 సార్లు బంగారు తెలంగాణ పదాన్ని వాడారు. అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది..’’అని వ్యాఖ్యానించారు. అసలు మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధర ఉండటమే తన దృష్టిలో బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ‘‘బంగారు తెలంగాణ వారాలు, నెలల్లో ఆవిష్కృతం కాదు.. దాని కోసం నిర్మాణాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించాం. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు కానన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినం. వారు బంగారు మంచాలేస్తే మేం పీకి పాడుచేసినమా?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, అప్పులు.. ఇలా కాం గ్రెసోళ్లకు రెండు మూడు అంశాలు ఉన్నాయని, ఎప్పుడు చూసినా వాటినే చెప్తుంటారని, ఈ తీరు చూసి జనం నవ్వుతున్నారన్నారు. వారు రాష్ట్రాన్ని కారు చీకట్లు చేస్తే, తాము వెలుగులు తేలేదా, బంగారు తెలంగాణ దిశగా వేస్తున్న బాటలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, రెండు మూడు చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎమ్మెల్యే వివేకానంద్ భవనాలు సీజ్..
కుత్బుల్లాపూర్: హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే వివేకానంద్ అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులు శనివారం సీజ్ చేశారు. భవన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీప బంధువు ప్రతాప్ రెండేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించగా, సదరు నిర్మాణాన్ని కూల్చి వేయాలని తీర్పునిచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్ గడువు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. దీంతో తిరిగి హైకోర్టులో వాదనల అనంతరం అక్రమంగా నిర్మించిన భవనంలో కొనసాగుతున్న కళాశాల, స్కూళ్లను ఖాళీ చేయాలని, నిర్మాణాలను కూల్చి వేసి ఫోటోలు అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో శనివారం ఉదయం నార్త్ జోన్ సిటీ ప్లానర్ సుజాత, ఏసీపీ సతీష్‌చంద్ర, డిప్యూటీ డిఈఓ ఉషారాణి తదితరులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య భవనాలను సీజ్ చేశారు. గత నెల రోజులుగా స్కూల్, కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు ఉప కమిషనర్ మమత ‘సాక్షి’కి తెలిపారు. ఎమ్మెల్యే వివేకానంద్ నిర్మించిన అక్రమ భవనం.. కళాశాలను సీజ్ చేసిన అధికారులు.. -
ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు
దాయాదుల మధ్య ‘టపాసుల’ చిచ్చు హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దాయాదుల మధ్య టపాసుల చిచ్చు రేగింది. టపాసుల దుకాణం ఏర్పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటనలో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్ శివారులోని చింతల్లో వివేకానంద్, తన బాబాయి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌లకు సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఎమ్మెల్యే వివేకానంద్ సూచన మేరకు హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణం ఏర్పాటు చేశాడు. వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని ప్రతాప్ తనయుడు కేపీ విశాల్ దుకాణదారుడిని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాటామాటా పెరగడంతో వివేకానంద్ ఆగ్రహాంతో విశాల్‌పై చేయి చేసుకున్నారు. తనపై దాడి చేసి కొట్టారని విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఎమ్మెల్యే వివేకానంద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రూ.15 వేల విలువైన టపాసులు ఇవ్వాలని తనను బెదిరించారని దుకాణ యజమాని హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్‌పై పలు కేసులు నమోదు చేశారు.