హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొనలేదు.
2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఇలా..
2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్‌విట్‌లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment