Medchal Assembly Constituency
-
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎవరు శాసించబోతున్నారు..?
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యాసంస్థల అదినేత చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలలో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి 2018లో టిక్కెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మల్లారెడ్డికి 167009 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 78943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి నక్కా ప్రబాకర్ గౌడ్‌కు సుమారు 25800 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. మల్లారెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు బిసి నేతలు, రెండుసార్లు ఎస్.సి.నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి 1978లో గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్నగర్లోను ఆయన గెలుపొందారు. గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన ఈయన నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఉన్నారు. ఒకసారి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అదే సమయంలో మొదల్కెన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు. మేడ్చల్‌లో రెండుసార్లు గెలిచిన సమిత్రాదేవి మరో మూడుసార్లు ఇతర చోట్ల గెలిచారు. టిడిపిలో జడ్పి ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రి పదవిని అలంకరించిన టి.దేవేందర్‌గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్.టిఆర్., చంద్రబాబు క్యాబినెట్లలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌గౌడ్ 2008 నాటికి టిడిపిని వదలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేసి కొంత కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి మల్కాజిగిరి లోక్‌సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీచేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు.ఆ తర్వాత తిరిగి టిడిపిలో పునః ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రరెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి కూడా మంత్రి పదవులు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..