అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే? | Khairatabad Constituency Candidates Use Vote | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?

Published Thu, Nov 30 2023 7:15 AM | Last Updated on Thu, Nov 30 2023 7:15 AM

Khairatabad Constituency Candidates Use Vote - Sakshi

హైదరాబాద్: ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  

►బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని ఓల్డ్‌ వెంకటేశ్వరనగర్‌ బూత్‌ నెం. 130లో తన ఓటు వేయనున్నారు.  

► కాంగ్రెస్‌ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్‌ డివిజన్‌ పరిధిలోని టెలిఫోన్‌ భవన్‌ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్‌ బూత్‌ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
 
► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్‌ డివిజన్‌పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2 షేక్‌పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్‌లో ఓటు          వేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement