తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'! | Tollywood Latest Movie Love Your father Shooting Begins Today | Sakshi
Sakshi News home page

Love Your Father Movie: తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'!

Published Mon, Feb 12 2024 9:03 PM | Last Updated on Mon, Feb 12 2024 9:04 PM

Tollywood Latest Movie Love Your father Shooting Begins Today - Sakshi

శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ యువర్ ఫాదర్'. ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీకి మెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ కామకూర శాలిని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా.. సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..'గతంలో కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు వర్క్ చేశా. కిషోర్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్‌పై అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. '1983 నుంచి ఇప్పటివరకు మా నిర్మాణ సంస్థ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్‌ చూపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..' ఇదే నా మొదటి సినిమా. వందశాతం కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.ఈ చిత్రంలో ఎస్పీచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement