sri harsha
-
ఓం భీమ్ బుష్!
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమాకి ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగామి దుస్తులు ధరించి, తమ చేతుల్లో కరపత్రాలతో నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్ లుక్ ఆసక్తిగా ఉంది. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూ΄÷ందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. మార్చి 22న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్. -
తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'!
శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ యువర్ ఫాదర్'. ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీకి మెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..'గతంలో కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు వర్క్ చేశా. కిషోర్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్‌పై అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. '1983 నుంచి ఇప్పటివరకు మా నిర్మాణ సంస్థ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ చూపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..' ఇదే నా మొదటి సినిమా. వందశాతం కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.ఈ చిత్రంలో ఎస్పీచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. -
ఓ ఆత్మ ప్రతీకారం
వీర్, శ్రీ హర్ష, నిషా, ఖుషి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో కేవీ పాపారావు నిర్మించిన ‘చండిక’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఓ ఆత్మ ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని కొత్తగా చూపించాం. ఈ చిత్రంలో నిర్మాత గురురాజ్ ఓ కీలక పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు నేనే కథ రాశాను’’ అన్నారు చిత్రనిర్మాత కేవీ పాపారావు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ విన్, కెమెరా: నగేశ్. -
జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచారు: యంగ్ డైరెక్టర్
ఈ సంక్రాంతికి చిన్న సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. రౌడీ బాయ్స్‌తో ఆశిష్, హీరోతో గల్లా అశోక్ కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. వీరిలో ఎవరు హిట్ అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన రౌడీ బాయ్స్ శుక్రవారం (జనవరి 14న) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ హర్ష సాక్షితో ముచ్చటించాడు. 'అనుపమ పరమేశ్వరన్ ఆశిష్‌కు సీనియర్‌గా నటించింది. ఎన్టీఆర్ ఇంటికి పిలిస్తే వెళ్లాం. నా ఫస్ట్ మూవీ హుషారు అంటే ఇష్టమని మెచ్చుకున్నాడు. రౌడీ బాయ్స్ ట్రైలర్ చూసి షాకయ్యారు. రెండుమూడు సార్లు చూశారు. ఆయన ఫ్యాన్స్ వల్లే మా మూవీకి హైప్ వచ్చింది. బన్నీగారు మా సాంగ్ లాంచ్ చేయడం క్రేజీ మూమెంట్' అని శ్రీహర్ష చెప్పుకొచ్చాడు. మరి ఆయన ఇంకా ఏమేం మాట్లాడారనేది తెలియాలంటే కింది వీడియో చూసేయండి. -
రౌడీ బాయ్స్ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
రౌడీ బాయ్స్‌ను ‘ప్రేమదేశం’తో పోలుస్తున్నారు, కానీ
‘‘రౌడీ బాయ్స్’ను చాలామంది ‘ప్రేమదేశం’ చిత్రంతో పోలుస్తున్నారు. నా జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ‘రౌడీ బాయ్స్’ను తెరకెక్కించాను’’ అని డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహర్ష మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘హుషారు’ సక్సెస్ తర్వాత ‘దిల్’ రాజుగారు పిలిచి, కాలేజ్ నేపథ్యంలో ఏదైనా కథ ఉందా? అని అడిగారు. అప్పుడు ‘రౌడీ బాయ్స్’ లైన్ చెప్పాను. ఆ తర్వాత కథను పూర్తిస్థాయిలో వర్కౌట్ చేశాక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తాడని ‘దిల్’ రాజుగారు అన్నారు. ఆశిష్ కొత్తవాడైనా అనుభవం ఉన్న యాక్టర్లా చేశాడు. రాజుగారు ఈ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకోవడం కాస్త ఒత్తిడిగా అనిపించింది కానీ ఫిల్మ్‌మేకింగ్ పరంగా ఏ ఇబ్బందీ లేదు. ప్రతి కాలేజ్‌లో ఫ్రెషర్స్ డే పార్టీ ఉంటుంది. అదే ఫారిన్లో అయితే ‘ఫ్రాన్ నైట్’ అని కపుల్స్‌తో సెలబ్రేట్ చేస్తారు. దీని ఆధారంగానే ఈ సినిమాలో డేట్‌నైట్ కాన్సెప్ట్ ఉంటుంది. హీరో ఎంత క్రేజీగా ఉంటాడో అందుకు అపోజిట్‌గా హీరోయిన్ మెచ్యూర్డ్‌గా ఉండాలి. తెలుగు వచ్చిన హీరోయిన్ అయితే బాగుంటుందనిపించి అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నాం. ఈ సినిమా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా నచ్చుతుంది. ఇందులో విక్రమ్ పాత్ర ఫుల్‌లెంగ్త్‌లో ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నా తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ‘రౌడీ బాయ్స్’ రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి’’ అన్నారు. -
సింగపూర్‌లో కోవిడ్ బాధితులకు అండ
సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతేజం 15 ఏళ్ల శ్రీహర్ష శిఖాకొళ్లు సింగపూర్‌లో కోవిడ్ బాధితులకు అండగా నిలిచాడు. మహమ్మారి నియంత్రణ కోసం ‘నేను సైతం’ అంటూ కదిలాడు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బాధితులకు ఆర్థిక సాయం అందజేశాడు. గుంటూరుకు చెందిన శ్రీహర్ష సింగపూర్ అమెరికన్ హై స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించే లక్ష్యంతో 90 రోజుల పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాడు. అలాగే ‘‘అవసరమైన వారికి సహాయం చేయండి. వారిలో ఆశలను నింపండి’’ అనే నినాదంతో విరాళాలు సేకరించాడు. దాతల నుంచి రూ.20 లక్షల విరాళాన్ని సింగపూర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గివ్ డాట్ ఎస్.జీ’ అనే చారిటీ సంస్థకు ఆ విరాళాన్ని అందజేశాడు. ఈ సంస్థ ప్రస్తుతం సింగపూర్‌లోని కోవిడ్ బాధితులకు వైద్యం, మందులు, తదితర సదుపాయాలను అందజేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా లభించిన స్ఫూర్తితో తాజాగా తన సహా విద్యార్థులతో కలిసి ‘ఎకాన్ 101’ అనే సంస్థను స్థాపించాడు. యువ విద్యార్థులకు ఆర్ధిక అక్షరాస్యతపై జూమ్ యాప్ ద్వారా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాడు. విద్యార్ధుల భవిష్యత్‌కు, చక్కటి కెరీర్ నిర్మాణానికి దోహదం చేసే ఈ అవగాహన కార్యక్రమంలో 8 నుంచి 13 ఏళ్ల వయస్సు పిల్లలు పాల్గొంటున్నారు. -
ప్రిన్సిపాల్ సహా 10 మందిపై కేసు
కర్ణాటక,బనశంకరి: నగర శివార్లలో సర్జాపుర రోడ్డులో కసవనహళ్లి అమృత ఇంజనీరింగ్ కాలేజీ 7వ అంతస్తు పై నుంచి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ది శ్రీ హర్ష కేసులో కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు 10 మందిపై పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన శ్రీహర్ష (20)ను కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేసిందని ఆయన తండ్రి విజయ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అమృత ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనరాజ్‌స్వామి, అధ్యాపకులైన ఎస్జీ.రాజేశ్, బీఎల్.భాస్కర్, రవికుమార్, కేటీ.రమేశ్, నిపుణ్ కుమార్, అముద, బీ.వెంకటేశ్, ఎస్ఆర్.నాగరాజ, ఎన్ఎస్.మూర్తిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, సాక్ష్యాలు నాశనం చేశారని అభియోగాలు నమోదు చేశారు. కాలేజీ హాస్టల్లో సౌకర్యాల కొరతపై ప్రశ్నించినందుకు తమను వేధిస్తున్నారని, అది తట్టుకోలేక శ్రీ హర్ష ప్రాణాలు తీసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపించారు. ఈ కేసులో విద్యార్థుల, సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆగ్నేయవిభాగం డీసీపీ ఇషా పంత్ తెలిపారు. -
వేధింపులతోనే శ్రీహర్ష ఆత్మహత్య ?
కర్ణాటక,బనశంకరి : కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని తీవ్రమనస్థాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరప్పనఅగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణానికి చెందిన శ్రీహర్ష (20) సర్జాపురరోడ్డు కసవనహళ్లిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతూ కాలేజీ హస్టల్లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కాలేజీ హస్టల్లో నీరు, భోజన వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపిస్తూ వందలాదిమంది విద్యార్థులు గత నెల 23న రాత్రి ధర్నాకు దిగి వార్డెన్, వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యజమాన్యం కాలేజీ విద్యార్థుల గొడవపై విచారణకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిటీ గొడవకు పాల్పడిన 21 మంది విద్యార్థుల్లో శ్రీ హర్ష కూడా ఉన్నారు. ఇతడిపై క్రమశిక్షణ చర్యలకు విచారణ కమిటీ సిపారసు చేసింది. ఈ క్రమంలో తండ్రిని పిలుచుకుని రావాలని శ్రీ హర్షకు విచారణ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం వెళ్లి తండ్రి విజయ్‌కుమార్‌తో కలిసి శ్రీహర్ష సోమ వారం ఉదయం కాలేజీ వద్దకు చేరుకున్నారు. కానీ కాలేజీ లోపలికి అనుమతించకపోవడంతో గేట్ వద్ద ఇద్దరు నిలబడ్డారు. శ్రీహర్షను మాత్రమే కాలేజీ లోపలికి పిలిపించి యజమాన్యం చర్చించినట్లు తెలిసింది. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన శ్రీహర్ష మధ్యాహ్నం 12.30 సమయంలో 7వ అంతస్తు పైకెళ్లి అక్కడనుంది దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్షణం కాలేజీ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించలోగా మార్గమధ్యలో మృతి చెందారు. అనంతరం తండ్రి విజయ్‌కుమార్‌కు సమాచారం అందించడంతో కుమారుడి మృతి విషయం తెలుసుకుని విలపించడంతో వందలాదిమంది విద్యార్థులు కాలేజీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. తండ్రి విజయ్‌కుమార్ ఇతర విద్యార్థులు వచ్చేలోగా మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి రక్తస్రావమైన స్ధలాన్ని శుభ్రం చేశారు. ఘటనాస్థలాన్ని వీడియో తీసిన కొందరు విద్యార్థుల మొబైల్ లాక్కొని వీడియో, ఫొటోలను డిలిట్ చేశారని కాలేజీ యజమాన్యంపై విద్యార్థులు ఆరోపించారు. పరప్పన అగ్రహర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. శ్రీహర్షకు క్యాంపస్ సెలక్షన్ : ఇటీవల జరిగిన క్యాంపస్ ఎంపికలో శ్రీహర్షకు ఏడాదికి రూ.14 లక్షల వేతనంతో ఉద్యోగం లభించింది. అయితే కళాశాల యాజమాన్యం క్యాంపస్ సెలక్షన్ నియామక పత్రాన్ని అధికారులు శ్రీహర్ష నుంచి లాక్కొని అవమానించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. శ్రీహర్ష మృతికి పాలక మండలి కారణం : తన కుమారుడు శ్రీహర్ష మృతికి కళాశాల పాలక మండలి కారణమని మృతుడు తండ్రి విజయ్ కుమార్ ఆరోపించారు. తనతో మాట్లాడాలని తీసుకెళ్లి తనను గేట్ వద్దే నిలబెట్టారని కుమారుడిని తీసుకెళ్లి మానసికంగా వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాలేజీ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా ఆసుపత్రికి తరలించి ఘటనాస్ధలాన్ని శుభ్రం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
లండన్ ససెక్స్‌లో ఏం జరిగింది..!?
సాక్షి, ఖమ్మం: గత నెల 21న లండన్ లో కనిపించకుండా పోయిన ఖమ్మం జిల్లా బీజీపే అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ కుమారుడు ఉజ్వల శ్రీహర్ష మిస్టరీ ఇంకా వీడలేదు. లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన ఖమ్మం నివాసి సన్నె శ్రీహర్ష ఆచూకీ లభ్యంకాలేదు. దీనిపై శ్రీహర్ష తండ్రి సన్నె ఉదయ్‌ప్రతాప్ ఆదివారం లండన్ నుంచి ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం.. కొంతకాలం క్రితం లండన్‌లోని కియో యూనివర్సిటీ వారు శ్రీహర్షను ఓ ప్రాజెక్టు పనిమీద జపాన్‌కు పంపించారు. అక్కడ కొన్నాళ్లు ఉండి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేశాడు. ఆ ప్రాజెక్టులో 80 శాతం మార్కులతో టాప్‌గా నిలిచాడు. దీంతో వారు మరో ప్రాజెక్టు పత్రాల సమర్పణ కోసం నెదర్లాండ్స్ పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 21న జపాన్‌కు చెం దిన ఫోన్ నంబర్ (+81)0806554 నుంచి శ్రీహర్షకు సమాచారం అందింది. ససెక్స్ ప్రాంతానికి రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని సమాచారం రావటంతో లండన్‌కు 130 మైళ్ల దూరంలో ఉన్న ససెక్స్‌కు ఉదయం 9 గంటలకు బయలు దేరాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నుంచే శ్రీహర్ష ఆచూకీ లభించకుండా పోయింది . ఎక్కడికి వెళ్లినట్లు.. ససెక్స్ ప్రాంతానికి వెళ్లిన దగ్గర నుంచే శ్రీహర్ష కనిపించకుండా పోయాడు. అసలు అక్కడికి రమ్మన్నది ఎవరు.. గతంలో ప్రాజెక్టు కోసం జపాన్‌కు వెళ్లిన శ్రీహర్షకు అక్కడి ప్రొఫెసర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు ఏమైనా సమాచారం అందించారా.. వారు సమాచారం ఇస్తే యూనివర్సిటీ నుంచి ఇస్తారు. ప్రత్యేకంగా ఎందుకిస్తారనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జపాన్‌కు చెందిన వారు శ్రీహర్షను అక్కడికి రప్పించారా.. అక్కడికి రప్పించిన వారు ఏంచేసి ఉంటారని తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లండన్ పోలీసులు జపాన్ నుంచి వచ్చిన ఫోన్ నంబర్ ఎవరిది.. వారు ఎందుకు సమాచారం అందించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తే శ్రీహర్ష ఆచూకీ తెలిసే అవకాశముంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం
‘‘హుషారు’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగుందని, ఆడుతుందని చెప్పాను. నిజంగానే ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ‘హుషారు’ యూనిట్‌కు అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 14న విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిపిన 50 రోజుల వేడుకలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ‘హుషారు’ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. కష్టానికి మంచి ఫలితం వస్తుందనడానికి మా సినిమానే ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతిరోజూ నా లైఫ్‌లో ఓ తీపి గుర్తు. ప్రేక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు’’ అని శ్రీహర్ష కొనుగంటి అన్నారు. తేజ్ కొర్రపాటి, దినేష్, తేజస్ కంచెర్ల, ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్ ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
తమిళంలో రీమేక్‌కు ‘హుషారు’
తెలుగు చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాదించిన హుషారు ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం కానుంది. తెలుగులో అందరూ కొత్త వారు నటించిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయడానికి దర్శకుడు వీవీ.కదిర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు జీవా కథానాయకుడుగా తెనావట్టు చిత్రానికి దర్శకత్వం వహించారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ మోగాఫోన్ పట్టి ఈ తెలుగు చిత్రం హుషారు రీమేక్‌ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జే.ఫణీంద్రకుమార్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో లాడన్ అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించారు. హుషారు చిత్రం తెలుగులో రూ.3.50 కోట్లతో రూపొంది సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర రీమేక్ హక్కులను గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని సెట్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, నూతన, ప్రముఖ తారలు నటించనున్న ఈ చిత్రానికి తెలుగులో సంగీతాన్ని అందించిన రథన్నే పనిచేయనున్నట్లు తెలిపారు. -
కొమ్మినేనికి పుత్రవియోగం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, సాక్షి టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మృతిచెందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీహర్ష రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కొమ్మినేని దంపతులు ఇటీవలే కెనడా వెళ్లారు. శ్రీహర్ష మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఈ శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని జగన్ ఫోన్లో కొమ్మినేనిని ఓదార్చారు. -
వెంకయ్య గారూ.. మీరే దిక్కు!
సాక్షి, అమరావతి : కొడుకు కోసం ఆతల్లి పేగు తపించిపోతోంది. ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం వెళ్లి కనిపించకుండా పోయిన కుమారుడి కోసం ఆ తండ్రి ఎదురుచూడని రోజు లేదు. తన బిడ్డ ఆచూకీ కోసం తొక్కని గుడిలేదు, కలవని ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు లేడు. చివరకు మీరే దిక్కంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆశ్రయించారు. వివరాల్లోకి విజయవాడ, నున్న గ్రామానికి చెందిన గుదిబండి లక్ష్మారెడ్డి, పార్వతి భవానీ దంపతుల కుమారుడు శ్రీహర్షారెడ్డి(28) ఉద్యోగం కోసం 2016లో పూణె వెళ్లాడు. అప్పటి నుంచి ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అయితే గత ఏడాది ఆగస్టు 6నుంచి ఫోన్ చేయడం లేదు. అనుమానం వచ్చిన పూణెకు వెళ్లి విచారించగా అదృశ్యం అయినట్లు గుర్తించారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు హర్ష కోసం గాలింపు చేపట్టారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును సైతం కలిసి తమ బిడ్డ ఆచూకీ కోసం సాయం చేయమంటూ అర్థించారు. అయినా ఫలితం లేకపోయింది. తాజాగా శ్రీహర్ష తల్లిదండ్రులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో కలిశారు. తమ బిడ్డ చూసి 18 నెలలైందంటూ విలపించారు. శ్రీహర్షారెడ్డి ఆచూకీ కోసం సాయం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. వారి ఆవేదనను విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్ర సీఎం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ విజయం
శ్రీహర్ష, క్రాంతి, సాయిత్రిశాంక్, బాబూమోహన్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘తెలంగాణ విజయం.’ బిపిన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ జె.ఎ.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇందులో కీలకపాత్ర పోషించడం విశేషం. బిపిన్ మాట్లాడుతూ -‘‘తెలంగాణ ఉద్యమం కారణంగా నేలరాలిన అమరవీరుల కుటుంబాల ఆవేదనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తెలంగాణలోని పలుగ్రామాల్లో చిత్రీకరణ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: రమ్య.