కొమ్మినేని శ్రీనివాసరావు(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, సాక్షి టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మృతిచెందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీహర్ష రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కొమ్మినేని దంపతులు ఇటీవలే కెనడా వెళ్లారు. శ్రీహర్ష మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఈ శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని జగన్ ఫోన్‌లో కొమ్మినేనిని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment