‘‘రౌడీ బాయ్స్’ను చాలామంది ‘ప్రేమదేశం’ చిత్రంతో పోలుస్తున్నారు. నా జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ‘రౌడీ బాయ్స్’ను తెరకెక్కించాను’’ అని డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహర్ష మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘హుషారు’ సక్సెస్ తర్వాత ‘దిల్’ రాజుగారు పిలిచి, కాలేజ్ నేపథ్యంలో ఏదైనా కథ ఉందా? అని అడిగారు. అప్పుడు ‘రౌడీ బాయ్స్’ లైన్ చెప్పాను. ఆ తర్వాత కథను పూర్తిస్థాయిలో వర్కౌట్ చేశాక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తాడని ‘దిల్’ రాజుగారు అన్నారు. ఆశిష్ కొత్తవాడైనా అనుభవం ఉన్న యాక్టర్‌లా చేశాడు. రాజుగారు ఈ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకోవడం కాస్త ఒత్తిడిగా అనిపించింది కానీ ఫిల్మ్‌మేకింగ్ పరంగా ఏ ఇబ్బందీ లేదు. ప్రతి కాలేజ్‌లో ఫ్రెషర్స్ డే పార్టీ ఉంటుంది. అదే ఫారిన్‌లో అయితే ‘ఫ్రాన్ నైట్’ అని కపుల్స్‌తో సెలబ్రేట్ చేస్తారు.
దీని ఆధారంగానే ఈ సినిమాలో డేట్‌నైట్ కాన్సెప్ట్ ఉంటుంది. హీరో ఎంత క్రేజీగా ఉంటాడో అందుకు అపోజిట్‌గా హీరోయిన్ మెచ్యూర్డ్‌గా ఉండాలి. తెలుగు వచ్చిన హీరోయిన్ అయితే బాగుంటుందనిపించి అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నాం. ఈ సినిమా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా నచ్చుతుంది. ఇందులో విక్రమ్ పాత్ర ఫుల్‌లెంగ్త్‌లో ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నా తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ‘రౌడీ బాయ్స్’ రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment