
ఈ సంక్రాంతికి చిన్న సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. రౌడీ బాయ్స్‌తో ఆశిష్, హీరోతో గల్లా అశోక్ కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. వీరిలో ఎవరు హిట్ అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన రౌడీ బాయ్స్ శుక్రవారం (జనవరి 14న) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ హర్ష సాక్షితో ముచ్చటించాడు.
'అనుపమ పరమేశ్వరన్ ఆశిష్‌కు సీనియర్‌గా నటించింది. ఎన్టీఆర్ ఇంటికి పిలిస్తే వెళ్లాం. నా ఫస్ట్ మూవీ హుషారు అంటే ఇష్టమని మెచ్చుకున్నాడు. రౌడీ బాయ్స్ ట్రైలర్ చూసి షాకయ్యారు. రెండుమూడు సార్లు చూశారు. ఆయన ఫ్యాన్స్ వల్లే మా మూవీకి హైప్ వచ్చింది. బన్నీగారు మా సాంగ్ లాంచ్ చేయడం క్రేజీ మూమెంట్' అని శ్రీహర్ష చెప్పుకొచ్చాడు. మరి ఆయన ఇంకా ఏమేం మాట్లాడారనేది తెలియాలంటే కింది వీడియో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment